భారతదేశం, అక్టోబర్ 27 -- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు రికార్డు స్థాయి ధరతో రైతులకు ఆనందాన్ని ఇచ్చింది. చాలాకాలంగా ఆశించిన స్థాయిలో మద్దతు ధర రాక నిరాశ చెందిన కర్షకులకు పెరిగిన ధరలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. సోమవారం జరిగిన ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌(ఈ-నామ్) ఇ-వేలంలో పసుపు క్వింటా గరిష్ఠంగా రూ.19,253 పలికి కేసముద్రం మార్కెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఇటీవల పసుపు సీజన్ ప్రారంభంలో క్వింటా ధర రూ.12,000 దగ్గరే అటు ఇటు తిరిగింది. క్రమంగా రూ.16,000 వరకు పెరిగినప్పటికీ, ఈ నెల 22న నిర్వహించిన క్రయవిక్రయాల్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,319 వద్దే ఆగింది. అయితే రెండు రోజులు సెలవుల తర్వాత సోమవారం మార్కెట్‌కు వచ్చిన పసుపు నాణ్యత చాలా బాగుండడంతో వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేశారు. ఫలిత...