భారతదేశం, మార్చి 13 -- మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ రైతుల వెన్ను విరుస్తున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ఎగుమతులు నిలిచిపోయి, అటు మహారాష్ట్రలోని సోలాపూర్, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని అరటి, బియ్యం రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు.

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా, ముఖ్యంగా ఉజని ఆనకట్ట పరివాహక ప్రాంతంలోని కర్మలా, మల్షిరాస్ తదితర ప్రాంతాలు నాణ్యమైన అరటి ఎగుమతులకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి ప్రతి ఏటా ఇరాన్, ఇరాక్, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (JNPT) వద్ద వేల టన్నుల అరటి నిల్వలు నిలిచిపోయాయి. సుమారు 24,000 మెట్రిక్ టన్నుల అరటి ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లోనే ఉండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నా...