భారతదేశం, సెప్టెంబర్ 20 -- పశువుల దొంగతనాలు, మొబైల్ షాపుల షట్టర్లు లేపి దోపిడీలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 22 లక్షల నగదు, మూడు నాలుగు చక్రాల వాహనాలు మరియు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ శనివారం వెల్లడించారు.

హైదరాబాద్ నగర పోలీసులు, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన ఈ ముఠా గుట్టును రట్టు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

"కంబైన్డ్ ఆపరేషన్‌లో భాగంగా పశువుల దొంగతనాలు, సెల్ ఫోన్ షాపుల షట్టర్లు లేపి చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను అరెస్టు చేశాం. నిందితుల నుంచి సుమారు రూ. 22 లక్షల నగదు, మూడు కార్లు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుక...