భారతదేశం, జూన్ 4 -- ప్రతిష్టాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కోటి మందితో ఈ నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. యోగాంధ్ర-2026 కార్యక్రమం నిర్వహాణపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమాలను ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వివరించారు. అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాల పైనా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా. జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అన...