భారతదేశం, జూలై 3 -- అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు తోడవడంతో పసిడి, వెండి ధరలు వరుసగా మూడో రోజూ లాభాల బాట పట్టాయి. అమెరికాలో ఉపాధి కల్పన మందగించడం, పశ్చిమాసియాలో ముడిచమురు సంక్షోభం సర్దుమణగడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు బులియన్ మార్కెట్‌కు కొత్త ఊపునిచ్చాయి. దేశీయంగా ఈ వారంలో మూడు నెలల కనిష్ట స్థాయిని తాకిన బంగారం ధరలు, ఇప్పుడు మళ్లీ భారీగా పుంజుకున్నాయి.

అమెరికాలో జూన్ నెలకు సంబంధించిన ఉద్యోగ నియామకాల గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. గడచిన కొన్ని నెలలుగా ఉపాధి మార్కెట్ పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ, జూన్‌లో మాత్రం కొత్త నియామకాలు మందగించాయి. ఈ పరిణామం జూలైలో జరగబోయే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు పెరగకపోవడం అనేది వడ్డీయేతర ఆదాయాన్ని ఇ...