భారతదేశం, అక్టోబర్ 19 -- హైదరాబాద్: దీపావళి సహా పండుగల సీజన్ రావడంతో మీ బంధువులు, మిత్రులకు వినూత్నంగా, వారి భవిష్యత్తుకు ఉపయోగపడే బహుమతులు ఇవ్వాలని భావిస్తున్నారా? సాధారణంగా ఇచ్చే దుస్తులు, స్వీట్లు, ఇతర కానుకల కంటే ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే షేర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కానుకగా ఇవ్వడం ఇప్పుడు మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఒకసారి ఇచ్చిన తర్వాత కూడా కాలక్రమేణా పెరుగుతూ దీర్ఘకాలిక రాబడులను అందించడం వీటి ప్రత్యేకం.

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ పెట్టుబడులను ఇతరుల పేరుపైకి మార్చే ప్రక్రియ చాలా సరళంగా మారింది. మీ ఇన్వెస్ట్‌మెంట్లు ఏ రూపంలో ఉన్నాయి (డీమ్యాట్ లేదా స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్) అనే దానిపై బదిలీ విధానం, అలాగే ఆ కానుకను ఎవరు అందుకుంటున్నారు అనే దానిపై పన్ను నిబంధనలు ఆధారపడి ఉంటాయి. ఆ వివరాలను వ...