భారతదేశం, జూన్ 21 -- ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లతో కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నేరేడు పండ్ల దిగుబడి విపరీతంగా పెరిగింది. అయితే ఈ బంపర్ కాపు వినియోగదారులకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలను, రైతులను మాత్రం ఒక తెలియని భయం వెంటాడుతోంది.

'నేరేడు పండ్లు విరగకాస్తే.. ఆ ఏడాది భయంకరమైన కరవు వస్తుంది.' అనేది మన తాతలు, ముత్తాతల కాలం నాటి నమ్మకం. ఈ ఏడాది సరిగ్గా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన 'ఎల్‌నినో' (El Nino) ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమై, వర్షాలు మొహం చాటేస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ పాత నమ్మకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పెద్దలు చెప్పే ఈ నమ్మకం వెనక వృక్ష శాస్త్రంలో ఒక బలమైన తర్కం ఉంది. సైన్స్ ప్రకారం దీనిని 'మాస్టింగ్' (Masting) లే...