భారతదేశం, మార్చి 14 -- భారత కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్) మాజీ టాప్ కమాండర్, కీలక వ్యూహకర్త తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 24న తెలంగాణ పోలీసులకు లొంగిపోయే ముందు పోలీసులు తనను, ఇతరులను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

చట్టపరమైన విధానంలో ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తానని తిప్పిరి తిరుపతి ప్రతిజ్ఞ చేశారు. సాయుధ పోరాటంలో నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన దేవూజీ.. తాను, ఇతర సభ్యులు మరణ భయం కారణంగా పోలీసులకు లొంగిపోలేదని స్పష్టం చేశారు. చట్టపరమైన చట్రంలో తమ భావజాలం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతాలను నమ్మె ప్రజల కోసం పనిచేయడానికే లొంగిపోయామని కూడా అన్నారు.

తాను ఎప్పుడూ మరణానికి భయపడనని, అలా అయితే.. గత ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు కీలక మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగ...