భారతదేశం, అక్టోబర్ 15 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ వేదికగా గ్రామీణ మహిళా సాధికారత దిశగా సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026'ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధి దాటి వెలుపలి రాష్ట్రంలో ఈ స్థాయి జాతీయ ప్రదర్శనను నిర్వహించడం ఇదే మొదటిసారి.

దేశవ్యాప్తంగా గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన 'దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్' (DAY-NRLM), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సుమారు 1,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళ...