భారతదేశం, అక్టోబర్ 16 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలకు అంతా సిద్ధమైంది. 100 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా వేగవంతమైంది. నేడు (శుక్రవారం) ఉదయం 11:00 గంటల నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నామినేషన్ల ప్రక్రియ ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు సాగనుంది.

స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాలతో పాటు మొత్తం 3,942 కార్పొరేటర్, కౌన్సిలర్ వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వీలుగా కమిషన్ 5,485 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

న...