భారతదేశం, ఫిబ్రవరి 25 -- హైదరాబాద్, బెంగళూరు లేదా ముంబై.. నగరం ఏదైనా సరే, ఆఫీసు వేళల్లో రోడ్డు మీదకు వెళ్లడమంటే నరకమే. గంటల కొద్దీ ట్రాఫిక్‌లో మాన్యువల్ కారు నడపడం వల్ల కాలు నొప్పులు రావడం సహజం. అందుకే, నేటి తరం ప్రయాణికులు 'ఆటోమేటిక్' కార్లను కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా, రోజువారీ సిటీ ట్రాఫిక్‌కు సరిపోయే ఐదు అత్యుత్తమ ఆటోమేటిక్ ఎస్‌యూవీల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

సిటీ ట్రాఫిక్‌లో మైలేజీని ప్రాధాన్యతగా తీసుకునే వారికి 'బ్రెజ్జా' ఎప్పుడూ మొదటి ఆప్షన్. మారుతి కార్లంటేనే పొదుపుకు మారుపేరు.

పర్యావరణంపై శ్రద్ధ చూపే వారికి, భారీ మైలేజీ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇందులో మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి.

స్టైల్, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారు స్కోడా కుషాక్‌...