భారతదేశం, ఆగస్టు 28 -- దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మందకొడిగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓ మైక్రోక్యాప్ కంపెనీ ఇన్వెస్టర్ల కళ్లల్లో వెలుగులు నింపుతోంది. దాదాపు రూ.565 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన 'మోల్డ్-టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్' (Mold-Tek Technologies Ltd) షేర్లు దలాల్ స్ట్రీట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే ఈ షేరు రూ.134.75 నుంచి ఏకంగా రూ.195 స్థాయికి ఎగబాకి, ఇన్వెస్టర్లకు 45 శాతానికి పైగా రాబడిని అందించింది.

ఇప్పుడు తమ వాటాదారులకు మరింత ఆనందాన్ని పంచుతూ ఉచిత బోనస్ షేర్లు, ఫైనల్ డివిడెండ్ రూపంలో డబుల్ బొనాంజాను ప్రకటించి వార్తల్లో నిలిచింది.

స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం, ఆగస్టు 26, 2026 (బుధవారం) నాడు జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతి ...