భారతదేశం, అక్టోబర్ 27 -- సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా స్వల్ప మొత్తంతో పొదుపు మొదలుపెట్టి కోటీశ్వరులు కావడం సాధ్యమేనా అంటే.. అవుననే సమాధానమిస్తున్నారు ఆర్థిక నిపుణులు. పెట్టుబడి విషయంలో పెద్ద మొత్తాల కంటే 'సమయం' ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంత త్వరగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించే అవకాశం ఉంటే, చక్రవడ్డీ (Power of Compounding) ప్రయోజనం అంత ఎక్కువగా లభిస్తుంది. కేవలం 5 ఏళ్లు ఆలస్యంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించినా, చివరికి చేతికి అందే కార్పస్ నిధిలో సగం కోల్పోవాల్సి వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

25 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ప్రతినెల Rs.3,500తో ఎస్‌ఐపీ ప్రారంభించారనుకుందాం. వార్షిక సగటు రాబడి 12 శాతంగా భావించి, ప్రతి ఏటా పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం చొప్పున పెంచుకుంటూ (Step-up Method) పోవాలి.

ఇలా 30 సంవత్సరాల పాటు వరుసగ...