నీట్ పేపర్ లీక్: మీరు ఇంకా పాఠం నేర్చుకోలేదా? ఎన్టీఏ తీరుపై సుప్రీంకోర్టు
భారతదేశం, మే 25 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) 2026 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం (మే 25) ఘాటుగా స్పందించింది. పరీక్షల నిర్వహణలో విఫలమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరును తప్పుబడుతూ.. "ఇన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా మీరు పాఠం నేర్చుకోవడం లేదా?" అని ప్రశ్నించింది. వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షను ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్వహిస్తారని ధర్మాసనం నిలదీసింది.
గత రెండేళ్లుగా నీట్ పరీక్ష వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 2024లోనూ పేపర్ లీక్ జరగడం, దానిపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవ్వడం మనకు తెలిసిందే. తాజాగా 2026లో కూడా అదే పునరావృతం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్లను విచారించింది. 202...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.