నీట్ పరీక్ష రద్దు దారుణం: రీ-ఎగ్జామ్ భయంతో విద్యార్థిని ఆత్మహత్య
భారతదేశం, జూన్ 4 -- నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్, ఆ తర్వాతి పరిణామాల వల్ల పరీక్ష రద్దవడం ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పరీక్ష రద్దవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన 20 ఏళ్ల నీట్ అభ్యర్థిని 14 రోజుల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్లో ఆత్మహత్య చేసుకుంది. సదరు విద్యార్థిని రాసిన ఆత్మహత్య లేఖ తాజాగా లభించడంతో ఈ దారుణానికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చాయి.
మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఈ యువతి, తన తండ్రి నాగపూర్లో వంటమనిషిగా పనిచేస్తుండటంతో కుటుంబంతో సహా అక్కడే నివసిస్తూ నీట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె మరణానంతరం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆమె పుస్తకాలను సర్దుతుండగా ఒక నోట్బుక్లో ఆత్మహత్య లేఖ దొరికింది.
"నీట్ పరీక్షలో మంచి మార్కులు వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.