భారతదేశం, మార్చి 7 -- పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సామాన్యుల్లో నెలకొన్న ఒకే ఒక్క ఆందోళన.. "పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?". అయితే, భారతీయులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 7, 2026) ఒక కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) ని ఇరాన్ మూసివేసినప్పటికీ, భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సాధారణంగా మన దేశానికి అందే ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా ఈ జలసంధి గుండానే వస్తాయి. అయితే, సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు హార్ముజ్ జలసంధి కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముడి చమురు దిగుమతులను కేంద్రం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.