భారతదేశం, జూన్ 11 -- Amma Naaku Aa Abbayi Kaavali Teaser Release Event: జీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మాతగా మారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వినూత్న ప్రేమకథ సినిమా ఇది.

శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లుగా చేస్తున్నారు. సీనియర్ హీరో సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ (జూన్ 11) అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి టీజర్ రిలీజ్ ఈవెంట్...