భారతదేశం, మే 31 -- క్యాన్సర్ చికిత్స రంగంలో నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో భారీ అడుగు వేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన వైద్య సేవలను రోగులకు చేరువ చేస్తూ నిమ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ (NGS) ఆధారంగా క్యాన్సర్‌ జీనోమిక్స్‌ సెంటర్‌ను విజయవంతంగా నడుపుతున్న నిమ్స్, త్వరలోనే కేవలం ఒకే ఒక్క రక్తపు చుక్కతో క్యాన్సర్‌ను గుర్తించే 'లిక్విడ్ బయాప్సీ' (Liquid Biopsy) సేవలను ప్రారంభించబోతోంది.

ఇప్పటికే క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక క్యాన్సర్ జెనోమిక్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది నిమ్స్. తెలంగాణ ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో 'నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్' (NGS) ఆధారిత క్యాన్సర్ నిర్ధారణ సేవలను అందిస్తున్న మొట్టమొదటి సంస్థగా నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింద...