భారతదేశం, మే 21 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఊపిరాడకుండా చేస్తున్న ఉక్కపోత, తీవ్రమైన వడగాల్పులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధికంగా బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత భయం పుట్టిస్తోంది ఇప్పటికే 11 జిల్లాల్లో 45 డిగ్రీల మార్కును దాటగా.. 18 జిల్లాల పరిధిలోని దాదాపు 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం గురువారం రాష్ట్రంలో ఎండలు మరింత ముదరనున్నాయి. సుమారు 74 మండలాల్లో తీవ్రమైన వడగాల్పుల...