నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం - నీటిలో మునిగి నలుగురు యువకులు మృతి!
భారతదేశం, జూలై 28 -- SRSP Nizamabad Drowning Incident : నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) వద్ద తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ వద్దకు వెళ్లిన నలుగురు యువకులు అనుకోకుండా నీటి ప్రవాహంలో చిక్కుకుని మునిగిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు యువకుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. గల్లంతైన మరో నాలుగో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
స్థానిక సమాచారం మేరకు.. సదరు నలుగురు యువకులు సరదాగా గడపడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్దకు వచ్చి నీటిలోకి దిగారు. నీటి లోతు, ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా లోతుల్లోకి జారుకుని మునిగిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ జిల్లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.