భారతదేశం, మార్చి 13 -- నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి తర్వాత ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అకొల (మహారాష్ట్ర) వెళుత్తోంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సు బోల్తా పడింది. ఘటన స్థలంలోనే నలుగురు ప్రయాణికులు చనిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తర

లించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....