నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ధరలు దిగొచ్చాయి: ప్రధాని మోదీ
భారతదేశం, నవంబర్ 21 -- లఖ్‌నవూ: అత్యవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయవద్దని తాను ఇచ్చిన పిలుపును దేశ ప్రజలు పాటించారని, ఫలితంగానే పసిడి ధరలు దిగివచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల పొదుపు మంత్రం వల్ల వారి డబ్బు ఆదా అయిందని సంతోషం వ్యక్తం చేశారు. శనివారం (నవంబర్ 21) ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని విభూతి ఖండ్‌లో ఉన్న ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో జరిగిన ఐదో జాతీయ నైపుణ్య స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
"అవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనవద్దని నేను ఏడాది క్రితం దేశ ప్రజలను కోరాను. నాడు లాల్ బహదూర్ శాస్త్రి జీ ఒక పూట భోజనం మానేయాలని పిలుపునిస్తే దేశం ఎలాగైతే పాటించిందో, నేడూ నా దేశ ప్రజలు అదే గుణగణాలను కొనసాగించడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
"నాలాంటి ఒక సామాన్యుడు బంగారం తక్కువ కొనమని కోరిత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.