భారతదేశం, మే 15 -- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితుడు పరారీలో ఉండగా, బాధితురాలైన మైనర్ బాలిక తల్లి తొలిసారిగా నోరు విప్పారు. తమకు జరిగిన అన్యాయం, ఎదురైన బెదిరింపులు, వ్యవస్థల నిర్లక్ష్యంపై ఆమె ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేశారు.

2025లో బండి భగీరథ్‌తో తన కుమార్తెకు పరిచయం ఏర్పడిందని బాధితురాలి తల్లి తెలిపారు. మొదట్లో సాధారణంగా సాగిన ఈ పరిచయం, ఆ తర్వాత భగీరథ్ పదేపదే ఫోన్లు చేయడం, ప్రలోభాలకు గురిచేయడంతో అది మానసిక ఒత్తిడికి దారితీసింది. మైనర్ అని కూడా చూడకుండా తన కుమార్తెను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడని ఆమె ఆరోపించారు.

"నా కుమార్తెకు ఇష్టం లేకపోయినా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా భగీరథ్ పదేపదే శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చేవాడు"...