భారతదేశం, నవంబర్ 11 -- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టి, అభివృద్ధి, సంక్షేమ సారథి కేసీఆర్‌ను మళ్లీ గెలిపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో నెలకొన్న కరువు కనిపించడం లేదని విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే గ్రామాల్లో నాటకాలు వేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. రైతు జీవితం కంటే రాజకీయ ప్రయోజనమే రేవంత్ రెడ్డికి ముఖ్యమా? రైతులకు ధైర్యం చెప్పడం చేతకాదు కానీ, కేటీఆర్ గడ్డం మీద మాత్రం రేవంత్ రెడ్డికి ఫికర్ పట్టుకుందన్నారు. నిర్మల్ రైతు గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.

గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీకి నెలకు వెయ్యి రూప...