నాసిరకం, కల్తీ ఆహారంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ వేటు: రూ.81.8 కోట్ల విలువైన ఆహారం సీజ్.. 1100 లైసెన్సుల రద్దు
భారతదేశం, నవంబర్ 8 -- పండగల సీజన్లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉక్కుపాదం మోపింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు రెండు నెలల పాటు దేశవ్యాప్తంగా సాగిన ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భారీ స్థాయిలో అక్రమాలను బయటపెట్టింది. నిబంధనలు ఉల్లంఘించిన తయారీదారులు, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటూ సుమారు రూ. 81.80 కోట్ల విలువైన 3,270 మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా అధికారులతో కలిసి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మెగా డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ కాలంలో ఏకంగా 56,431 ఆహార తయారీ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. నాణ్యతా లోపాలు ఉన్న 10,047 సంస్థలకు సవరణ నోటీసులు (ఇంప్రూవ్మెంట్ నోటీసులు) జారీ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.