నాలుగు రాష్టాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం!
భారతదేశం, జూన్ 3 -- తెలంగాణతో పాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఒకేసారి భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్.. ఒడిశా, తెలంగాణ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రూ.24,200 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నాలుగు ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది.
ఈ మొత్తం నిధుల్లో తెలంగాణ రాష్ట్ర రహదారుల విస్తరణకే ఏకంగా రూ.7,597.16 కోట్లను కేంద్రం కేటాయించడం విశేషం. పీఎం గతిశక్తి ఫ్రేమ్‌వర్క్ కింద ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
తెలంగాణలో రద్దీని తగ్గించేందుకు, జిల్లాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు NH-63, NH-563 జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించనున్నారు. నేషనల్ హైవే-63లోని ఆర్మూర్ - జగిత్యాల - మంచిర్యాల సెక్షన్, అలాగే నేషనల్ హైవే-563లోని జగిత్యాల -...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.