భారతదేశం, మే 5 -- నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత ఏడాది రూ.4.24 లక్షల కోట్లు ఉండగా... ఈ ఏడాది 20 శాతం పెంచి రూ.5,11,491 కోట్లతో ప్రాథమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది.

సాగుకు మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో పంట రుణాలు రూ.1.66 లక్షల కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.8,265 కోట్లు, ఫిషరీస్‌కు రూ.21,098 కోట్లు, హార్టికల్చర్‌కు రూ.11,961 కోట్లు కేటాయించింది.

హార్టికల్చర్‌లో రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు రూ.5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.9,957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు రూ.12,687 కోట్లతో ప్రణాళిక ...