భారతదేశం, సెప్టెంబర్ 23 -- నేచురల్ స్టార్ నాని-దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ప్యారడైజ్‌తో వచ్చారు. ఈ సినిమాలో కాకులకు ఎంత ప్రాధాన్యం ఉందో మెుదటి నుంచి జనాలకు అర్థమవుతూనే ఉంది. క్లియర్ కట్‌గా టీజర్‌లోనూ ఇది కడుపు మండిన కాకుల కథ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఆయా షేర్ పాటలో ధూం.. ధూం..త:త: అంటూ బీజీఎం ఇచ్చారు. మీరు టీజర్‌లో చూస్తే మెుదటల్లోనే ఒక చెట్టు కింద ఓ రూపంతో ఉన్న విగ్రహం కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు.. ధూమావతి దేవి అంటూ నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు ధూమావతి గురించి చర్చనడుస్తుంది. దీనిపై సినిమా టీమ్ ముందుగా ఎలాంటి విషయం చెప్పకపోయినప్పటికీ.. జనాలు ధూమావతి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు?

ధూమ అంటే పొగ, వతి అంటే కలిగినది. ధూమవతి అంటే పొగ రూపంలో ఉండేది లేదా పొగ చేత ఆవరించబడినది అని అర్...