భారతదేశం, జూన్ 2 -- కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, ఈ-మూల్యాంకనం (e-evaluation) టెండర్ ప్రక్రియలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు గట్టి పోటీ ఇస్తూ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే 'కోఎంప్ట్ ఎడ్యు టెక్ ప్రైవేట్ లిమిటెడ్' (Coempt Edu Teck) ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. టెండర్ రికార్డుల ప్రకారం.. సాంకేతిక విలువలలో టీసీఎస్ కంటే రెండు మార్కులు ఎక్కువ సాధించడమే కాకుండా, ఆర్థిక బిడ్‌లో భారీ వ్యత్యాసంతో కోఎంప్ట్ ఈ విజయాన్ని అందుకుంది.

ఈ ఏడాది సీబీఎస్‌ఈ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) పోర్టల్‌లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం, ఫలితాల అనంతర సేవల్లో ఆలస్యం జరగడంపై విద్యార్థులు, మూల్యాంకనదారుల నుంచి ఫిర్యాదుల...