భారతదేశం, ఆగస్టు 31 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు పులులు, ఇతర అరుదైన వన్యప్రాణుల సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా పేరుగాంచిన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అభివృద్ధి, పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత స్థాయి స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ జీవో ఎంఎస్ నంబర్ 42ను అధికారికంగా విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 (చట్టం సెక్షన్ 38U)లోని నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్‌పర్సన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారు. వైస్ చైర్‌పర్సన్‌గా డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, మెంబర్ సె...