భారతదేశం, జూలై 7 -- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) ఉచిత, నాణ్యమైన విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థుల నుండి ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 665 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు జరగనున్నాయి.

ముఖ్యమైన తేదీలు చూసుకుంటే.. దరఖాస్తుకు చివరి తేదీ జులై 31 వరకే ఉంది. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న ఉంటుంది. 2027 మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఫలితాలు ప్రకటిస్తారు. నవంబర్ 28న జరగనున్న JNV ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించిన మెరిట్ (మార్కులు) ఆధారంగా మాత్రమే పారదర్శక పద్ధతిలో ప్రవేశాలు ఉంటాయి.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 665 జవహర్ నవోదయ వ...