భారతదేశం, నవంబర్ 20 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను టీటీడీ నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనుంది. మొత్తం 115 లాట్ల న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ-వేలం ఐడీ నంబర్లు 28814 నుండి 28819 వరకు ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆసక్తి గల బిడ్డర్లు ఈ ఆన్‌లైన్ వేలంలో పాల్గొనవచ్చు. వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్ మేనేజర్ కార్యాలయం లేదా ఏఈవో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

అలాగే https://konugolu.ap.gov.in, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా 0877-2264429 ఫోన్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

టీ...