భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణ పర్యాటక శాఖ నవంబర్ 22 నుండి ఏ డే టు పోచంపల్లి(A Day to Pochampally) పేరుతో ఒక ప్రత్యేకమైన ఒకరోజు పర్యటన ప్యాకేజీని ప్రారంభిస్తోంది. దీని ద్వారా సందర్శకులు రాష్ట్రంలోని గొప్ప చేనేత వారసత్వాన్ని అన్వేషించవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లికి చెందిన సాంప్రదాయ ఇక్కత్(Ikat) నేత పద్ధతులను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం పోచంపల్లికి పేరుగాంచిన చేనేత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, స్థానిక నేత కార్మికుల నైపుణ్యాన్ని సందర్శకులు దగ్గరగా చూసి తెలుసుకునేలా చేయడం. ఈ పర్యటనలో భాగంగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించడం, ఆ తర్వాత హరిత పోచంపల్లి హోటల్‌లో భోజనం చేయడం ఉంటాయి. ఇక్కడ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన సాంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. అలాగే సందర్శకులను తెలంగాణ ...