నవంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణ వాతావరణ అంచనాలు ఇలా
భారతదేశం, నవంబర్ 11 -- తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొద్దిరోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం... బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకుంటోంది.
ప్రస్తుతం వాయవ్య ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో పాటు నవంబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి, తదుపరి 24 గంటల్లో మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశముంది.
కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుంది. రాయలసీమలో కూడా రాబోయే కొన్ని రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నప్పటికీ... నవంబర్ 14వ తేదీన రాయలసీమ పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.