భారతదేశం, నవంబర్ 10 -- నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న సినిమా 'క‌ల‌ర్ ఫోటో'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'బెదురులంక 2012'. ఈ రెండు చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'దండోరా'.

ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తాజాగా ఈ దండోరా సినిమాను క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న పోస్ట‌ర్‌ను తాజాగా ఇవాళ (నవంబర్ 10) విడుదల చేశారు.

ఈ దండోరా రిలీజ్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఓ ఖాళీ ప్రాంతంలో త‌వ్విన గొయ్యి కనిపిస్తోంది. అందులో ఈ ఏడాదికి డ్రామాటిక్‌గా ముగింపునిస్తున్నాం అనే క్యాప్ష‌...