భారతదేశం, జూన్ 12 -- భారతదేశ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత నర్సింగ్‌ కౌన్సిల్‌ (INC) సరికొత్త అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నర్సుల వృత్తిపరమైన నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక పోస్టు గ్రాడ్యుయేట్‌(PG) రెసిడెన్సీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్‌ కళాశాలల్లో రెండేళ్ల కాలవ్యవధి గల 10 సరికొత్త పీజీ రెసిడెన్సీ కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకుంది.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 'నర్సింగ్‌ ప్రాక్టీషనర్‌' విధానం అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. అక్కడ నర్సులు కేవలం వైద్యులకు సహాయకులుగా మాత్రమే కాకుండా, రోగుల సంరక్షణలో కీలక పాత్ర...