భారతదేశం, జూన్ 28 -- డిజిటల్ యుగంలో సోషల్ మీడియా గ్రూపుల వివాదాలు చివరకు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయి. వాట్సాప్ గ్రూప్ నుండి బ్లాక్ చేసి, తొలగించారనే కారణంతో ఓ మహిళ తనకు మానసిక వేధింపులు జరిగాయంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించిన వింత ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. తనను తిరిగి గ్రూపులో చేర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్ నివాసితులు స్థానిక బస్తీ సమస్యలు, కాలనీ విషయాలను పంచుకోవడానికి ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపులో స్థానిక సమస్యలు మినహా, ఎలాంటి రాజకీయ పరమైన అభిప్రాయాలు లేదా సందేశాలు పోస్ట్ చేయకూడదని గ్రూప్ అడ్మిన్ ముందే కచ్చ...