భారతదేశం, ఆగస్టు 20 -- Rhea Chakraborty About Sushant Case In The Traitors 2: బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తీవ్ర వివాదాలు, మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న హీరోయిన్, అతని లవర్ రియా చక్రవర్తి ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ రియాలిటీ షో 'ది ట్రేటర్స్' సీజన్ 2 లో పాల్గొంటోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ది ట్రేటర్స్ 2 షో ఐదో ఎపిసోడ్‌లో రియా చక్రవర్తి చేసిన కామెంట్స్ ప్రేక్షకులను, తోటి పోటీదారులను తీవ్రంగా కలచివేశాయి. ఈ ఓటీటీ షోలో భాగంగా నటి శ్వేతా తివారీ 'నువ్వు ఎందుకు ద్రోహివి కాదు (ట్రేటర్)?' అని ప్రశ్నించగా రియా అత్యంత భావోద్వేగంగా స్పందించింది.

"నేను ఈ షోలో కావాలని ద్రోహిగా మారి ఎవరినీ మానసికంగా చంపాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం నన్ను ఒక ద్రోహిగానే చూస్తోంది. నా వ్యక్తిగత జీవితంలో ఎదురైన ...