భారతదేశం, సెప్టెంబర్ 29 -- Anakapalli Pre Release Event Shiva Nirvana VV Vinayak Speech: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం 'అనకాపల్లి'. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు.

ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నటుడిగా మారడం విశేషం. అలాగే, ఆయన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా నిర్వహించిన అనకాపల్లి అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 27) నాడు అనకాపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ .. "లగడపాటి శ్రీధర్ గారికి మా అందరికంటే సినిమా పిచ్చి ఎక్కు...