ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భారతదేశం, సెప్టెంబర్ 15 -- శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గరుడాళ్వార్ చిత్రం కలిగిన ధ్వజ పటాన్ని ఆలయంలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం లోపల ఉన్న తిరుమలరాయ మండపంలో ఉత్సవ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.