భారతదేశం, జూలై 2 -- ధరణి, భూ భారతి భూ రికార్డుల పోర్టల్‌లలో అవకతవకలు జరిగినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. దీనిపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు సిఫార్సు చేయడంతోపాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఒక ప్రకటనలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రకారం 15 రోజుల్లోగా తన నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. భూ రికార్డుల భద్రత, సమగ్రత, పారదర్శకత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని స్పష్టం చేశారు.

ఈ కమిటీలో మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐటీ అండ్ కమ్య...