భారతదేశం, ఆగస్టు 15 -- తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సేవల (DOST - Degree Online Services, Telangana) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 14,975 మంది విద్యార్థులకు తాత్కాలికంగా సీట్లు కేటాయించారు.

ఈ స్పెషల్ డ్రైవ్ విడతలో సీట్లు పొందిన అభ్యర్థుల్లో చాలామంది తమ ప్రాధాన్యత క్రమానికి అనుగుణంగానే సీట్లను సాధించారు. సీటు సాధించిన వారిలో 12,068 మంది విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యత ఆధారంగానే సీట్లను పొందారు. మిగిలిన 2,906 మంది విద్యార్థులకు వారి రెండవ లేదా తదుపరి ఆప్షన్ల ఆధారంగా సీట్లు లభించాయి.

కోర్సుల విషయానికొస్తే.. కామర్స్ 6,198, లైఫ్ సైన్సెస్ 3,080, ఫిజికల్ సైన్సెస్ 2,798, ఆర్ట్స్ 2,878...