దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు - రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం..! అనుమానితుడి విచారణ
భారతదేశం, ఆగస్టు 25 -- భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు తెగబడిన ముఠాల గుట్టు రట్టు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వేగం పెంచింది. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో దేశ భద్రతకు అత్యంత కీలకమైన డిజిటల్ నెట్వర్క్పై దాడులకు యత్నించిన కేసులో ఎన్ఐఏ అధికారులు సోమవారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాలు మొత్తం ఐదు కీలక ప్రాంతాల్లో సాగాయి. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంతో పాటు మహారాష్ట్రలోని పుణే (జున్నార్), గుజరాత్లోని ఖేడా (నాడియాడ్), బీహార్లోని గోపాల్గంజ్, దేశ రాజధాని ఢిల్లీలలో ఎన్ఐఏ బృందాలు ఒకేసారి రంగంలోకి దిగాయి.
గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసారన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు ఘాతకానికి ఒడిగట్టారు. పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.