భారతదేశం, మే 15 -- ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టు శిలాఫలకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్ సీఎల్ ప్రాజెక్టులకు చెందిన శిలాఫలకాలను వర్చువల్‌గా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి బాటలు పడ్డాయన్నారు. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావటం ఎంతో కీలకమని చెప్పారు. దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగానూ పుట్టపర్తి మారుతుందన్నారు. AMCA ప్రాజెక్టుతో ఆత్మనిర్బర్ భారత్...