భారతదేశం, మార్చి 25 -- భారతదేశ ఆర్థోపెడిక్ చికిత్సలో ఒక కొత్త శకం మొదలైంది. భుజం, మోచేయి, మణికట్టు, మోకాలి సమస్యలతో పాటు లిగమెంట్ సమస్యలు, కండరాల గాయాలకు అత్యంత కచ్చితత్వంతో చికిత్స అందించే విప్లవాత్మక 'పానోస్కోపీ' సాంకేతికతను కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ (బేగంపేట) బుధవారం అధికారికంగా ప్రారంభించింది.

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి మాట్లాడారు.

"సాధారణంగా వాడే ఆర్థ్రోస్కోపీ టెక్నాలజీ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, దాని ద్వారా కీళ్లలోని కొన్ని లోతైన లేదా సంక్లిష్టమైన గాయాలను గుర్తించడం కష్టమవుతుంది. ఎందుకంటే అందులో పరిమితమైన వీక్షణ (Field of vision) మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన పానోస్కోపీ టెక్నాలజీ ద్వారా కీళ...