భారతదేశం, మార్చి 31 -- దుబాయ్ అంటేనే లగ్జరీకి, ఆడంబరానికి మారుపేరు. తాజాగా అక్కడ జరిగినట్టుగా చెబుతున్న ఒక పెళ్లి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఓ వధువు తల నుంచి కాళ్ల వరకు భారీ ఎత్తున బంగారాన్ని ధరించి కనిపించడమే దీనికి కారణం. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు, ఇది నిజంగానే సాధ్యమేనా అంటూ తీవ్రంగా చర్చిస్తున్నారు.

మార్చి 30న యూఏఈలోని విలాసవంతమైన జీవనశైలిని చూపే 'ఫ్యూ డిస్కవరీ' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను పంచుకుంది. "దుబాయ్‌లో జరిగిన ఈ పెళ్లిలో తల నుంచి కాళ్ల వరకు బంగారంతో మెరిసిపోతున్న ఈ వధువు లుక్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో కింద ఒలేవ్ లవ్ అనే ఇండోనేషియా కంటెంట్ క్రియేటర్ స్పందిస్తూ.. ఆ వీడియో తనదేనని, తమకు క్రెడిట్ ఇవ్వాలని కోరింది.

ఆమె ధరించిన ...