భారతదేశం, అక్టోబర్ 26 -- దుబాయ్‌లో కొనుగోలు చేసిన కొత్త ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) మొబైల్‌కు కస్టమ్స్ డ్యూటీ చెల్లించేందుకు నిరాకరించిన ఓ ప్రవాస భారతీయుడు కొచ్చిలోని నెడుంబస్సేరి విమానాశ్రయంలో వినూత్న నిరసనకు దిగాడు. అధికారులు తన వద్ద ఉన్న ఐఫోన్‌ను జప్తు చేయడంతో విమానాశ్రయంలోనే బైఠాయించి ఆందోళన చేపట్టాడు.

ఎడ్యుపోర్ట్ (Eduport) లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడు అజాస్ మహమ్మద్ ఇటీవల దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన వెంట తెచ్చుకున్న కొత్త ఐఫోన్ 18 ప్రోను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఫోన్‌పై కస్టమ్స్ సుంకం చెల్లించాలని సూచించగా.. అది తన సొంత వినియోగం కోసమే తెచ్చుకున్నానని, డ్యూటీ కట్టేది లేదని అజాస్ తేల్చి చెప్పారు.

కస్టమ్స్ నిబంధనలపై అజాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "అన్యాయంగా ఒక్క రూపాయి కూడా కస...