భారతదేశం, సెప్టెంబర్ 24 -- మారుతున్న వాతావరణం, అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే దగ్గును చాలామంది చిన్న సమస్యగానే పరిగణిస్తారు. అయితే, వారాల తరబడి వేధించే దీర్ఘకాలిక దగ్గు (Chronic Cough) వెనుక అనేక రకాల శ్వాసకోశ సమస్యలు ఉండే అవకాశముంది. లక్షణాలు ఒకేలా అనిపించినప్పటికీ, వ్యాధి తీవ్రత వేర్వేరుగా ఉండవచ్చు. సరైన కారణాన్ని గుర్తించకుండా అంచనాలతో సొంత వైద్యం చేసుకోవడం వల్ల అసలు జబ్బు తీవ్రమై, ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఊపిరితిత్తులు, శ్వాసనాళాల సమస్యల వల్ల మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో తలెత్తే అనారోగ్యాల వల్ల కూడా దగ్గు రావచ్చు.

ఆస్తమా (Asthma): దగ్గుతో పాటు పిల్లికూతలు (Wheezing), ఛాతీలో బిగుతుగా ఉండటం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో ఈ సమస్య మరింత...