భారతదేశం, నవంబర్ 7 -- దీపావళి పండుగ, వారాంతపు సెలవుల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేగా, మరోవైపు రైళ్లలో ప్రయాణించే వారి భద్రత కోసం తనిఖీలను తీవ్రతరం చేసింది.

దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు రైళ్లలో బాణసంచా, టపాసులు లేదా ఇతర ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరమని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్, సీపీఆర్‌వో వై. బాలాజీ కిరణ్ స్పష్టం చేశారు.

రైల్వే చట్టం - 1989 నిబంధనల ప్రకారం.. రైలు ప్రయాణాల్లో పేలుడు పదార్థాలు, బాణసంచా, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్, యాసిడ్ వంటి మండే స్వభావం కలిగిన వస్తువులను రవాణా చేయడం చట్టరీత్యా నేరం. నిబంధనలను ఉల్లంఘించి బాణసంచా లేదా ప్రమాదకర వస్...