భారతదేశం, నవంబర్ 8 -- దివ్యకాంతుల దీపావళి అంటేనే ప్రమిదల వెలుగులు, చిన్నారుల కేరింతలు, పటాకుల సవ్వడులు. అయితే ఈ ఆనందోత్సాహాల మధ్య పటాకుల వల్ల జరిగే ప్రమాదాలు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పటాకులు కాల్చేటప్పుడు ఎగిసిపడే నిప్పురవ్వలు, అకస్మాత్తుగా పేలే బాంబులు తీవ్రమైన కంటి గాయాలకు కారణమవుతున్నాయి. పటాకులు కాల్చే వారికే కాకుండా, పక్కన నిలబడి చూసే వారికి కూడా ఈ ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. పండుగ వేళ కంటి ఆరోగ్య పరిరక్షణపై బెంగళూరులోని నేత్రధర్మ సూపర్‌స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుప్రియ శ్రీగణేష్ పలు కీలక విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించారు.

పటాకుల పొగ వల్ల వచ్చే కళ్ల మంటలు, అలర్జీల నుంచి మొదలుకొని తీవ్రమైన కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్లు, చివరకు శాశ్వత అంధత్వానికి దారితీసే ప్రమాదాలు దీపావళి సమ...